![]() |
![]() |
.webp)
సర్కార్ లేటెస్ట్ ప్రోమోలో సుధీర్ తో పాటు విష్ణు ప్రియా కూడా హోస్ట్ చేయడానికి వచ్చేసింది. ఈ ఎపిసోడ్ కి "పాపం ప్రతాప్ "మూవీ టీమ్ నుంచి తిరువీర్, ప్రసాద్ బెహ్రా, స్నేహ, రవి వచ్చారు. ఈ ప్రోమో లాస్ట్ లో సుధీర్ అందరితో కన్నీళ్లు పెట్టించేలా మాట్లాడాడు. "ఇక్కడ ఉన్న ప్రతీ ఒక్కరి తొలి ప్రేమ ఏంటి " అంటూ సుధీర్ అడిగాడు. వెంటనే తిరువీర్ "మీ ఫస్ట్ లవ్ ఏంటి మీరు చెప్పండి " అన్నాడు.
"14 ఏళ్ళ రిలేషన్ షిప్ కదా ఎందుకు బ్రేక్ అయ్యింది " అంటూ విష్ణు ప్రియా కూడా చాలా హృదయ విదారకంగా అడిగింది. "తాను వేరే వాళ్ళను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. నాకు తెలిసి ఈ విషయం ఏంటి ఇదంతా అని అడిగాను. అప్పుడు ఆమె నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నన్ను డిస్టర్బ్ చేయొద్దు అన్నారు. నెక్లెస్ రోడ్ లో పరిగెడుతున్నా, అరుస్తున్నా ఏంటేంటో చేస్తున్నా" అనేసరికి అందరూ మొహాలు డల్ గా ఐపోయాయి. ఇక విష్ణు ప్రియా సుధీర్ కి కో - హోస్ట్ గా రాబోతోంది. వీళ్ళిద్దరూ కామెడీ టైమింగ్ కానీ, ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో వీళ్ళను మించిన వాళ్ళు ప్రస్తుతం లేరు. ఇక వీళ్ళ కాంబో మీద నెటిజన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నారు. తెగ మెసేజెస్ పెట్టి పోవే - పోరా వైబ్ ఉండబోతోంది. ప్రతీ సర్కార్ సీజన్ కి వీళ్ళిద్దరినే కంటిన్యూ చేయండి. ఇక ఈ షో సూపర్ హిట్ జోడి సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
![]() |
![]() |